Chain Snatchers steal gold chain from Man : హైదరాబాద్‌లో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. మహిళలకే రక్షణ లేదు అనుకుంటే.. ఇప్పుడు మగవారి కూడా రక్షణ లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ని రోజులు ఒంటరి మహిళల మెడల్లో నుంచే చైన్‌లను దోచుకుపోతున్నారు అనుకుంటే ఇప్పుడు పురుషులను సైతం చైన్ స్నాచర్స్ వదలడం లేదు. ఎంత భద్రత ఉన్నా.. ఎన్ని నిఘా నేత్రాలు ఉన్నా.. వారి పనిని వారు భయం లేకుండా కానిచ్చేస్తున్నారు. ఒకవేళ దొరికితే తమ జీవితం ఏం అవుతుందే అన్న ఆలోచన కూడా వారికి లేదు.
ఇలాగే నెల రోజుల క్రితం వృద్ధురాలి మెడలో రెండు తులాల గొలుసును పట్టుకుపోయారు. అంతకు ముందు అడ్రస్ ముసుగులో వచ్చి.. మహిళ మెడలో నుంచి బంగారం చైన్‌ను లాక్కొనే క్రమంలో ఆమె కింద పడిపోయిన దోపిడీదారులు ఆగలేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని భావించి.. పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. దీంతో ఆడవారి మెడలో చైన్‌లను దొంగలించే వారు కాస్త నెమ్మదించినట్లు.. ఈసారి రూట్ మార్చారు. ఇప్పుడు మగవాళ్లను టార్గెట్ చేస్తున్నారు.
Chain Snatchers Steal 40 Grams Gold Chain : తాజాగా హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ప్రసాద్ అనే వ్యక్తి మెడలో నుంచి గుర్తు తెలియని దుండగులు బంగారం గొలుసును లాక్కేల్లారు. ఉప్పల్‌లోని జెన్ పాక్ట్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఆయన.. తెల్లవారు జామున స్నేహితులతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చినట్లు చెప్పారు. అల్పాహారం చేసి చైతన్యపురి క్రాస్ రోడ్‌లో రహదారిపై నిల్చుని ఉన్నాడు. ఈ లోపు యాక్టివా వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు.. 40 గ్రాముల చైన్‌ను చోరీ చేశారని బాధితుడు తెలిపాడు. ఆ గొలుసును మెడలో నుంచి తెంచే క్రమంలో తనకి ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నాడు. ఆ వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని వ్యక్తిపై థర్డ్ డిగ్రీ : గత ఏప్రిల్ నెలలో గొలుసు దొంగతనం చేశాడనే అనుమానంతో పోలీసులు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక వ్యక్తిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో అతను ఆ దెబ్బలను తట్టుకోలేక.. మృతి చెందాడు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. పోలీసుల కొట్టడంతో దెబ్బలు తిన్న అతని రెండు కిడ్నీలు దెబ్బతిని ఆసుపత్రిలోనే మృతి చెందాడు. ఈ విషయంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఈ కేసును హెబియస్ కార్పస్ ప్రాతిపదికన కేసును వార్తాపత్రికలో చూసి న్యాయస్థానం కేసును తీసుకుంది.
ఇవీ చదవండి :