తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైన్​ కొట్టేసి వస్తుండగా యాక్సిడెంట్.. నిందితుడు మృతి - కేరళ చైన్​ స్నాచర్​

Chain Snatcher Died: ఓ చైన్ స్నాచర్.. గొలుసు కొట్టేసిన కొద్దిసేపటికే మృతి చెందాడు. తన స్నేహితుడితో కలిసి బైక్​పై వెళుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ఘటన కేరళలో జరిగింది.

Chain snatcher dies in road accident in Thiruvananthapuram

By

Published : May 9, 2022, 6:42 AM IST

Chain Snatcher Died: కేరళలో చైన్ స్నాచింగ్‌ల కేసులో నిందితుడైన ఓ 17 ఏళ్ల యువకుడు మరణించాడు. ఆదివారం తిరువనంతపురంలోని నరువామూడు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు డివైడర్‌ను బైక్‌ ఢీకొనడం వల్ల మృతి చెందాడు. అతడితో పాటు బైక్​పై వెళుతున్న మరో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.

నిందితులిద్దరూ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తుక్కలే ప్రాంతంలో బంగారు గొలుసు దొంగలించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడిపై ఒక స్నాచింగ్‌ కేసు నమోదు కాగా, అతడి సహ నిందితుడు కేరళలో 15 స్నాచింగ్‌ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:బెల్టులతో కొడుతూ చిత్రహింసలు.. మూకదాడిలో యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details