ఝార్ఖండ్ వెస్ట్ సింఘభూమ్ జిల్లాలోని కుమారదుంగి పోలీసులు (jharkhand police).. రమేశ్ బెహరా అనే వ్యక్తిని చితకబాదారు. తనకు న్యాయం చేయాలని ట్విట్టర్లో ఆ పోలీస్ స్టేషన్ను ట్యాగ్ చేసినందుకు పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితుడు పేర్కొన్నాడు.
మొదట స్టేషన్ ఇన్ఛార్జ్, ఏఎస్ఐలు తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు చెప్పాడు బాధితుడు. రాత్రి స్టేషన్కు రావాలని ఒత్తిడి చేయగా.. అందుకు తాను తిరస్కరించానని వివరించారు. దీంతో కొంతమంది పోలీసులు తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల ముందే తనపై చేయి చేసుకున్నట్లు ఆరోపించాడు. అంతేగాకుండా తనను అనవసరంగా స్టేషన్కు ఈడ్చుకెళ్లినట్లు పేర్కొన్నారు.
"ఈ చర్య పోలీసుల అధికార దుర్వినియోగానికి నిదర్శనం. ఇంట్లో ఉన్ననన్ను స్టేషన్కు తీసుకెళ్లి.. ఇన్ఛార్జ్ అంకిత్ సింగ్, ఏఎస్ఐ ప్రకాశ్ కుమార్లు తీవ్రంగా కొట్టారు. దీనిపై వెస్ట్ సింఘు భూమ్లో ఎస్పీకి ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం చేయాలని ఇప్పటికే డీజీపీ, డీఐజీ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రికి లేఖ రాశాను."