తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భద్రతా సిబ్బందిని వైద్య సాయం కోరిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లో కొవిడ్​ పాజిటివ్​ తేలిన మావోయిస్టు దంపతులు.. భద్రతా దళాలను వైద్య సాయం కోరారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వారు కోలుకున్న తర్వాత లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మరికొంతమంది నక్సల్స్ కూడా కరోనాతో బాధపడుతున్నట్లు సమాచారం.

Maoist couple
మావోయిస్టులు

By

Published : May 14, 2021, 5:36 AM IST

కరోనా సోకిన మావోయిస్ట్​ దంపతులు.. భద్రతా సిబ్బందిని వైద్య సాయం కోరారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌ కంకర్ జిల్లాలో జరిగింది. ఆ దంపతులిద్దరూ కంకర్​లోని కొవిడ్​ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.

మావోయిస్టుల మెడ్కి లోకల్​ ఆర్గనైజేషన్​ స్క్వాడ్​లో చురుకుగా పనిచేస్తున్న అర్జున్​ తట్టి, అతని భార్య లక్ష్మి పద్దా.. కామ్‌డేటా బీఎస్‌ఎఫ్​ శిబిరంలోని భద్రతా సిబ్బందిని సంప్రదించి.. తాము అనారోగ్యంతో ఉన్నామని, సహాయం చేయాలని అభ్యర్థించినట్లు బస్తర్​ రేంజ్​ ఐజీ సుందరాజ్​ తెలిపారు. అలాగే వారు కోలుకున్న తర్వాత వారి లొంగిపోయే ప్రక్రియ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

కరోనా వల్లే కావచ్చు!

'సుక్మా బీజాపూర్ జిల్లాల దక్షిణ భాగంలో పదిమందికిపైగా నక్సల్స్​ చనిపోగా.. మరికొందరు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం అందిందని' అని సుందర్‌రాజ్​ తెలిపారు. అయితే ఈ ఆకస్మిక మరణాలకు కారణమేంటన్నది స్పష్టంగా తెలియలేదని పేర్కొన్న ఆయన.. కరోనా వల్లే చనిపోయినట్లు క్షేత్రస్థాయి నివేదికలు సూచిస్తున్నాయని తెలిపారు.

అనారోగ్యం పాలైన మావోయిస్టులు లొంగిపోయి ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:టైమ్స్​ గ్రూప్​ ఛైర్​పర్సన్​ జైన్​ మృతి- ప్రధాని సంతాపం

ABOUT THE AUTHOR

...view details