ఛత్తీస్‌గఢ్‌లో విషాద ఘటన జరిగింది. దుర్గ్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో ఇద్దరు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడగా.. మరో ముగ్గురు కాలిన శరీరంతో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్లో ఉందని వెల్లడించారు. మృతులను రామ్ బ్రిజ్ గైక్వాడ్, అతని భార్య జంకీ బాయి, కుమారుడు సంజు, కుమార్తెలు జ్యోతి , దుర్గాలుగా గుర్తించారు.
ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య- కారణమేంటి? - ఫ్యామిలీ సూసైడ్
ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాకి చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక సమస్యలే ఇందుకు ప్రధాన కారణంగా సూసైడ్‌నోట్‌లో పేర్కొంది.

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ ఆత్మహత్య
తండ్రి రామ్, కుమారుడు సంజు ఇంట్లోనే ఉరి వేసుకోగా... అతని భార్య, కుమార్తెలు పొలంలో నిప్పంటించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి తమరాధ్వాజ్ సాహు విచారణకు ఆదేశించారు.
Last Updated : Mar 7, 2021, 7:23 AM IST