తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెలంగాణలో రీ పోలింగ్‌కు అవకాశమే లేదు - ఎల్లుండి 10:30 గంటలకు తొలి రౌండ్ ఫలితాలు : వికాస్​రాజ్

CEO Vikas Raj on Telangana Elections Counting Arrangements : ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 71.01 పోలింగ్ శాతం నమోదైనట్లు సీఈవో వికాస్​రాజ్​ వివరించారు. 2018 ఎన్నికలతో పోలిస్తే.. 2023లో పోలింగ్ శాతం తగ్గిందన్నారు. ఈ క్రమంలోనే ఎల్లుండి జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.

CEO Vikas Raj on Telangana Elections Counting
CEO Vikas Raj

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 4:02 PM IST

తెలంగాణలో రీ పోలింగ్‌కు అవకాశమే లేదు - ఎల్లుండి 10:30 గంటలకు తొలి రౌండ్ ఫలితాలు : వికాస్​రాజ్

CEO Vikas Raj on Telangana Elections Counting :రాష్ట్రంలో గురువారంపోలైన ఓట్ల వివరాల పరిశీలన జరుగుతోందని.. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 71.01 పోలింగ్​ శాతం నమోదైనట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. మరో రెండు గంటల్లో పూర్తి వివరాలు తెలుస్తాయని.. అప్పుడు పోలింగ్ శాతంపై పూర్తి స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 79 నియోజక వర్గాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ జరిగిందని వివరించారు. రాష్ట్రంలో 1766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్​ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిందని తెలిపారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్న వికాస్ రాజ్.. 40 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Telangana Elections Counting Arrangements : మొదట 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, అలాగే 8.30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం అవుతుందని వికాస్ రాజ్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుందని వెల్లడించారు. మొదటి ఆధిక్యం 10.30 ప్రాంతంలో తెలిసే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ, రేపు కౌంటింగ్‌ ఏర్పాట్లు జరుగుతాయన్నారు. చిన్న నియోజకవర్గాల్లో ఉదయం 10.30కు తొలిరౌండ్‌ ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయిందన్న వికాస్ రాజ్.. 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి టేబుల్​పై మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారని స్పష్టం చేశారు. ప్రలోభాలు, ఉల్లంఘనలకు సంబంధించి గతంలో కంటే ఈ మారు చాలా ఎక్కువ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. 2018లో 2400 కేసులు ఉంటే.. ఇప్పుడు 13,000 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కొందరు మంత్రులపై కూడా కేసులు నమోదయ్యాయని చెప్పారు.

ఓటు వేసేందుకు క్యూ ఎంత ఉంది - ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు : సీఈఓ వికాస్​రాజ్​

'ప్రతి 10 పోలింగ్‌ కేంద్రాలకు ఒక సెక్టార్‌ అధికారిని పెట్టాం. 4,039 రూట్‌ ఆఫీసర్లు, 1,251 మంది ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు అందుబాటులో ఉంటారు. ఇప్పటి వరకు ఉన్న వివరాల మేరకు రాష్ట్రంలో పోలింగ్ శాతం 71.01 నమోదైంది. 2018 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గింది. రాష్ట్రంలో ఎల్లుండి ఓట్ల లెక్కింపు కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.'- వికాస్ రాజ్, తెలంగాణ సీఈవో

Telangana Assembly Elections Polling 2023 : రాష్ట్రంలో మొత్తంగా 3,26,02,799 ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. వారిలో 16,005 వృద్ధులు, 9,459 దివ్యాంగులు హోం ఓటింగ్ వేశారని చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 1,80,000 పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 610 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా.. 597 మహిళలు, 119 దివ్యాంగులు, 119 యువ ఉద్యోగులు దీనిని నిర్వహించారు. ఆదిమ చెంచు తెగలు ఓటు హక్కు వినియోగించుకునే విషయమై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. అలాగే 27,094 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 7591 కేంద్రాల వెలుపల సీసీటీవీ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. థర్డ్ జెండర్ వాళ్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారని వికాస్ రాజ్ వివరించారు. ప్రతి టేబుల్​పై మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు

రాష్ట్రంలో రీ పోలింగ్‌కు అవకాశం లేదు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.03 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాలో 46.56 శాతం పోలింగ్‌ నమోదైంది. సీ విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు వచ్చాయి. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. -వికాస్ రాజ్, తెలంగాణ సీఈవో

పట్టణ ప్రాంతాల్లో పోలింగ్​ పుంజుకుంటుందని ఆశిస్తున్నాను : వికాస్​ రాజ్​

ప్రలోభాలకు తావులేకుండా విస్తృత తనిఖీలు - 24 గంటలు నిఘా : సీఈవో వికాస్ రాజ్

ABOUT THE AUTHOR

...view details