మూడో దశ కరోనా వాక్సిన్ పంపిణీ ప్రక్రియ వివక్షతతో కూడుకుని ఉందని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అది పూర్తిగా మార్కెట్లకు, అనుకూలంగా.. ప్రజల శ్రేయస్సుకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి మమత రెండో లేఖ రాశారు.
మే1 నుంచి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కరోనా టీకా వేయించుకోవడానికి కేంద్రం అనుమంతించింది. కాగా కేంద్రానికి రూ. 150కి, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600, రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు రూ.400కు అమ్ముతున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ ప్రకటించింది.