బంగాల్ ఎన్నికల అనంతరం భాజపాను వీడి సొంతగూటికి చేరిన ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌కు వీఐపీ భద్రతను కేంద్రం తొలగించింది. ఈ మేరకు రాయ్‌కు అందిస్తున్న జెడ్ కేటగిరీ భద్రతా విధుల నుంచి వైదొలగాల్సిందిగా కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ను ఆదేశించింది. అలాగే రాయ్ కుమారుడు సుబ్రంగ్షుకు సీఐఎస్ఎఫ్ అందిస్తున్న భద్రతను సైతం ఉపసంహరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది బంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయనకు సీఆర్‌పీఎఫ్ భద్రతను ఏర్పాటు చేసింది కేంద్రం. 22-24 మంది సాయుధలైన కమాండోలు ఆయన వెంట ఉండేవారు.
అయితే... తనకు వీఐపీ భద్రత అవసరం లేదని కేంద్రానికి ముకుల్ రాయ్ లేఖ రాశారని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సమాచారం.