తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా యోధులకు కొత్త బీమా పాలసీ!

కరోనా యోధుల(వైద్యసిబ్బంది) కోసం గతేడాది కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ బీమా పథకం గడువు ఈ నెల 24తో ముగియనుంది. అయితే దీని తర్వాత వారి కోసం కొత్త బీమా పాలసీ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Corona warriors
కరోనా యోధులు

By

Published : Apr 19, 2021, 2:47 PM IST

కరోనా యోధులైన వైద్యులు, వైద్య సేవల సిబ్బంది కోసం కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ(పీఎంజీకేపీ) బీమా పథకం గడువు ఈనెల 24తో ముగియనుంది. అయితే దీని తర్వాత వారి కోసం కొత్త బీమా పాలసీ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది అనుకోకుండా మరణిస్తే వారిపై ఆధారపడిన వారికి రూ.50 లక్షల బీమా అందించేలా పీఎంజీకేపీని రూపొందించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 287 క్లెయిమ్‌లను పరిష్కరించారు.

ఈ బీమా క్లెయిమ్‌లను ఈ నెల 24వ తేదీ వరకూ పరిగణనలోకి తీసుకొని పరిష్కరించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది మార్చిలో ప్రకటించిన పథకాన్ని మూడుసార్లు పొడిగించామని, గడువు ముగుస్తున్నందున ఆ తర్వాత కరోనా యోధులకు అందించాల్సిన బీమా కవరేజీ గురించి న్యూ ఇండియా అస్సూరెన్స్‌ కంపెనీతో చర్చిస్తున్నట్లు వివరించింది.

ఇదీ చూడండి:రైలుకు ఎదురెళ్లి బాలుడ్ని కాపాడిన పాయింట్స్​మన్

ABOUT THE AUTHOR

...view details