తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వచ్చే ఐదేళ్లలో వైద్య రంగంలో రూ.64 వేల కోట్లు వెచ్చిస్తాం' - Center to invest on Health sector

దేశంలో ఆరోగ్య మౌలికసౌకర్యాల కల్పన కోసం రానున్న ఐదేళ్లలో కేంద్రం రూ.64 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ(Union Health Minister news) వెల్లడించారు. ఆరోగ్య సంక్షేమ పథకాల ద్వారా అందరికీ ఆరోగ్య భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Union Health Minister
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

By

Published : Nov 27, 2021, 9:43 AM IST

వచ్చే ఐదేళ్లలో దేశంలో ఆరోగ్య మౌలికసదుపాయాల కల్పన కోసం కేంద్రం రూ.64,000 కోట్ల ఖర్చు చేయనుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయ(Union Health Minister Mansukh Mandaviya) తెలిపారు. పలు ఆరోగ్య సంక్షేమ పథకాల(Health welfare schemes in India) ద్వారా అందరికీ ఆరోగ్య భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అరుణాచల్​ప్రదేశ్​ తవాంగ్​ జిల్లాలో ఒక రోజంతా పర్యటనలో ఉన్న ఆయన.. ఖండ్రో ద్రోవా జంగ్మో జిల్లా ఆసుపత్రిలోని వైద్య సబ్బందితో మాట్లాడారు.

"గతంలో ఎప్పుడూ ఆరోగ్యాన్ని సంపదగా భావించలేదు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. పలు ఆరోగ్య సంక్షేమ పథకాల ద్వారా అందరికీ ఆరోగ్య భద్రత(Health security in India) కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అలాగే దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను(Health infrastructure in India) మెరుగుపరిచేందుకు వచ్చే ఐదేళ్లలో కేంద్రం రూ.64,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది" అని మాండవీయ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్​ ప్రయోజనాలు(Ayushman Bharat Digital Mission benefits ) వివరించారు. దేశంలో ఆస్పత్రులను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడానికి.. రోగుల ఆరోగ్య చరిత్ర గురించి తెలుసుకుని నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు.

ఇదీ చూడండి:Barmer daughter: కట్నం డబ్బులు.. గర్ల్స్ హాస్టల్​ నిర్మాణానికి విరాళం

ABOUT THE AUTHOR

...view details