రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరో మూడు లక్షల కరోనా టీకా(Corona Vaccine) డోసులను పంపిణీ చేశామని, అవి మరో మూడు రోజుల్లో ఆ ప్రాంతాలకు చేరతాయని కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు 22.46 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేశామని తెలిపింది. వీటిలో 20.48 కోట్ల డోసులను రాష్ట్రాలు వినియోగించుకున్నాయని పేర్కొంది. 1.84 డోసులు ఇంకా రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
రాష్ట్రాలకు మరో 3 లక్షల కరోనా టీకాలు - రాష్ట్రాల్లో కరోనా టీకా
రాష్ట్రాలకు ఇప్పటివరకు 22.46 కోట్ల కరోనా టీకా(Corona Vaccine) డోసులను పంపిణీ చేశామని, మరో మూడు లక్షల డోసులను ఇటీవల పంపించామని కేంద్రం వెల్లడించింది. టీకా ఉత్పత్తిదారుల నుంచి 50 శాతం డోసులను సేకరించనున్నామని తెలిపింది.
రాష్ట్రాలకు కేంద్రం డోసుల పంపిణీ!
మూడో దశ వ్యాక్సిన్ పంపిణీలో(Corona Vaccination) భాగంగా టీకా ఉత్పత్తిదారుల నుంచి 50 శాతం డోసులను సేకరించనున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఆ డోసులను రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొంది.
ఇదీ చదవండి :'అల్లోపతి డాక్టర్లను ఆయుర్వేద వైద్యులుగా మార్చేస్తా!'