Covid-19 treatment guidelines: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు వేల మందికి వైరస్ సోకుతున్న క్రమంలో కరోనా రోగుల చికత్స మార్గదర్శకాలను సవరించింది కేంద్రం. అత్యవసర వినియోగం కింద రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్ వినియోగించేందుకు అనుమతించింది. అయితే, అన్ని ప్రమాణాలు చేరుకున్నప్పుడే వినియోగించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. తీవ్ర లక్షణాలతో 10 రోజులకుపైగా బాధపడుతున్న కొవిడ్ రోగులకు రెమ్‌డెసివర్ వినియోగించాలని సూచించింది.
" కరోనాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు ఐదు రోజుల పాటు రెమ్‌డెసివిర్ వినియోగించాలి. అయితే, ఆక్సిజన్ సపోర్ట్ లేదా ఇన్‌హోమ్ సెట్టింగ్‌లో లేని వారికి ఉపయోగించకూడదు. అలాగే.. కొవిడ్ బారిన పడి ఆక్సిజన్ సపోర్ట్ లేదా ఐవీఎం అవసరమైన, స్టెరాయిడ్స్‌కు స్పందించని వారికి మాత్రమే టోసిలిజుమాబ్‌ను సూచించాలి. తీవ్రంగా ప్రభావితమై ఐసీయూలో చేరాల్సి వచ్చిన వారికి 24-48 గంటల్లోపు వినియోగిస్తే మేలు. టీబీ, ఫంగల్, సిస్టెమిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేని వారికి మాత్రమే ఈ మాత్రలు ఇవ్వాలి. "