దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఏడాది శాసన వ్యవస్థల పరంగా అనేక చర్యలు తీసుకున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం 'విపత్తు నిర్వహణ చట్టం-2015'ను ప్రయోగించిన సంగతి గుర్తు చేసింది. 2020లో దేశవ్యాప్తంగా చట్టాలు/శాసన వ్యవస్థల పరిస్థితిని విశ్లేషించటం ద్వారా 'పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్' ఈ నివేదికను రూపొందించింది.
నివేదికలోని ముఖ్యాంశాలివీ..
- రాష్ట్ర ప్రభుత్వాలు అంటువ్యాధుల చట్టం-1897కు అనుగుణంగా తాత్కాలిక నిబంధనావళిని రూపొందించాయి. కొన్ని రాష్ట్రాలు ఆ చట్టానికి సవరణలు చేపట్టాయి.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, గుజరాత్, పంజాబ్ సహా పలు రాష్ట్రాలు వైరస్ వ్యాప్తి నివారణకు మార్గదర్శకాలు విడుదల చేశాయి.
- కర్ణాటక, కేరళ, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ వంటి రాష్ట్రాలు మహమ్మారిని అదుపు చేసేందుకు ఆర్డినెన్సులను తీసుకొచ్చాయి. తమ రాష్ట్రాల్లో ఏ వ్యాధినైనా సరే అంటువ్యాధిగా గుర్తించే అధికారాన్ని తద్వారా సముపార్జించుకున్నాయి. లాక్డౌన్ విధింపు, ప్రయాణికుల తనిఖీ, సరిహద్దుల మూసివేత, జరిమానాల వసూలు వంటి అధికారాలనూ పొందాయి.
- కొన్ని రాష్ట్రాలు చట్టాల సహాయంతో స్థానిక ఎన్నికలను వాయిదా వేశాయి. మరికొన్ని.. ఓట్లు వేసే విధానంలో ప్రజలకు వెసులుబాట్లు కల్పించాయి.