కరోనాను ఎదుర్కొడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రిటన్ లాంటి దేశాలతో పోల్చితే కరోనా నియంత్రణలో భారత్ మెరుగ్గా ఉందన్నారు. అయితే కరోనాపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. పలు వ్యాక్సిన్లు దేశంలో అందుబాటులో ఉన్నాయని.. టీకా పంపిణీ వేగంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ నిర్వహించింది కేంద్రం.
అనంతరం కరోనా నిర్వహణపై అఖిలపక్ష పార్టీ నేతలకు వివరించారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వివరించారు. వారి నుంచి సలహాలు సూచనలను స్వీకరించారు.
ఆరోగ్య మౌలిక వసతుల కల్పన, మూడో వేవ్ సంసిద్ధత, కరోనా ఆర్థిక ఉపశమన చర్యలను కూడా మోదీ వివరించారు. మరోవైపు.. కొవాగ్జిన్‌కు అంతర్జాతీయ గుర్తింపు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలని కొన్ని పార్టీలు కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.