తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్​ కట్టడికి కేంద్రం ప్రత్యేక బృందాలు - యూటీల్లో పెరిగిన కొవిడ్ ఉద్ధృతి

దేశంలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్న వేళ... కేంద్రం అత్యున్నత స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు కొన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చేరుకున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

Multi-disciplinary High Level Central teams
కొవిడ్​ ఉద్ధృతిపై ఆరా- రాష్ట్రాలకు చేరిన కేంద్ర బృందాలు

By

Published : Feb 24, 2021, 3:14 PM IST

కరోనా మరోమారు విజృంభిస్తున్న రాష్ట్రాలకు కేంద్రం ఉన్నత స్థాయి బృందాలను పంపింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, జమ్ముకశ్మీర్​లో కొవిడ్​ను కట్టడి చేయడంలో స్థానిక ప్రభుత్వాలకు ఈ బృందాలు అండగా నిలవనున్నాయి.

ముగ్గురు సభ్యులుండే ఈ బృందాలకు ఆరోగ్య శాఖలోని జాయింట్​ సెక్రటరీ లెవల్​ అధికారి అధ్యక్షత వహిస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

"రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొవిడ్​ ఉద్ధృతికి కారణాలేంటనే అంశంపై ఈ బృందాలు ఆరాతీయనున్నాయి. కొవిడ్ కట్టడికై పలు ప్రాంతాల్లోని ఆరోగ్య సిబ్బందికి సహాయం చేయనున్నాయి" అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి:భారత్​లో కరోనా కేసుల పెరుగుదలకు అవే కారణమా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details