Expired Covid Vaccines: దేశంలో గడువు ముగిసిన కరోనా టీకాలు పంపిణీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్రం ఖండించింది. ఆ వార్తలు నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవిగా పేర్కొంది. అటువంటి టీకాలను వాడటం లేదని స్పష్టం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో కొవిషీల్డ్, అక్టోబరులో కొవాగ్జిన్ టీకాల కాలపరిమితి పొడిగింపునకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) ఆమోదించినట్లు తెలిపింది.
"దేశంలో గడువు తీరిన వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపిస్తూ కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఇవి తప్పుదారి పట్టించేవి. అసంపూర్ణ సమాచారం ఆధారంగా ఆరోపణలు చేయడం తగదు" అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది
గతేడాది అక్టోబరు 25న కొవాగ్జిన్ కాల పరిమితిని 9 నెలల నుంచి 12 నెలలకు.. 2021 ఫిబ్రవరి 22న కొవిషీల్డ్ కాల పరిమితిని ఆరు నుంచి తొమ్మిది నెలలకు పొడిగింపునకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) ఆమోదం తెలిపినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.