కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ను(niti aayog news) పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సచివాలయం ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాని అధ్యక్షతన పనిచేసే ఈ సంస్థ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్, పూర్తిస్థాయి సభ్యులు వీకే సారస్వత్, రమేష్‌చంద్, వీకే పాల్‌లను యథాతథంగా కొనసాగించింది.
ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఇది వరకు కేంద్ర హోం, ఆర్థిక, రైల్వే, వ్యవసాయ, ప్రణాళికా శాఖల సహాయ మంత్రులు ఉండగా, ఇప్పుడు అందులో నుంచి రైల్వే, ప్రణాళికా శాఖల సహాయ మంత్రులను తొలగించింది. కొత్తగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఇదివరకు రహదారి రవాణా, సామాజిక న్యాయం సాధికారత, విద్యాశాఖల మంత్రులు ఉండగా, ఇప్పుడు ఈ జాబితా నుంచి విద్యాశాఖను తొలగించింది. కొత్తగా వాణిజ్య శాఖ, రైల్వేశాఖ మంత్రులను చేర్చింది.