drone certification scheme: కనీస భద్రత, నాణ్యత ప్రమాణాల సాధన లక్ష్యంగా డ్రోన్ల ధ్రువీకరణ పథకంపై పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ వెలువరించింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి సరళీకృత నిబంధనలు ఉపయోగపడుతాయని ఈ శాఖ తెలిపింది.
డ్రోన్లకు ధ్రువీకరణను సులభంగా, త్వరగా, పారదర్శకంగా ఇచ్చేందుకు ఇవి దోహదపడుతాయని పేర్కొంది. డిజిటల్ స్కై అనే ఏక గవాక్ష విధానం, ఉత్పత్తి ముడిపడిన ప్రోత్సాహకాలు వంటివి డ్రోన్ల తాయారీ పరిశ్రమ ఎదుగుదలకు ఉపకరిస్తాయని తెలిపింది. దిగుమతిదారులకు, విడిభాగాలను తెచ్చి ఒకటిగా మార్చేవారికి కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నా అంశాలు వర్తిస్తాయని వెల్లడించింది.