తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2021, 5:41 PM IST

ETV Bharat / bharat

సింగిల్ యూజ్ ప్లాస్టిక్​ బ్యాన్- ఎప్పటి నుంచంటే?

సింగిల్ యూజ్ ప్లాస్టిక్​పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు, ట్రేల తయారీ, విక్రయం, వాడకంపై నిషేధం విధించనున్నట్లు తెలిపింది.

single-use plastic items ban
సింగిల్ యూజ్ ప్లాస్టిక్​ బ్యాన్

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 జులై 1 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం విధించనున్నట్లు తెలిపింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలపై నిషేధం అమలవుతుందని వెల్లడించింది. వీటి తయారీ, విక్రయం, వాడకంపై ఈ నిషేధం వర్తిస్తుందని పేర్కొంది.

ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులపై ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నుంచి కొత్తగా మరికొన్ని ఆంక్షలు వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 30 నుంచి 75 మైక్రాన్ల ప్లాస్టిక్‌ కవర్లకే అనుమతి ఉంటుందని తెలిపింది. 2022 డిసెంబర్‌ 31 తర్వాత 120 మైక్రాన్ల కవర్లనే అనుమతించనున్నట్లు పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details