నూతన ఐటీ నిబంధనల(New IT Rules)ను సవాల్ చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు(Supreme Court)కు బదిలీ చేయాల్సిందిగా ఉన్నత న్యాయస్థానాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్‌లపై చట్టబద్ధమైన తీర్పునకు వీలుగా వీటిని బదిలీ చేయాలని అభ్యర్థించింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ అధికారి ఒకరు ధృవీకరించారు.
New IT Rules: 'ఆ పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ!' - ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్
నూతన ఐటీ రూల్స్(New IT Rules)కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ అధికారి ధ్రువీకరించారు.
ఐటీ చట్టాల పిటిషన్లు సుప్రీంకు బదిలీ
ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమ వేదికలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను తీసుకువచ్చింది. దీని ప్రకారం 50 లక్షలకు పైగా యూజర్లు ఉన్న సామాజిక మాధ్యమ సంస్థలు.. ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భారతీయులైన అధికారులను ఇందుకోసం నియమించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను సవాల్ చేస్తూ దిల్లీ సహా వివిద హైకోర్టుల్లో పిటిషన్‌లు దాఖలయ్యాయి.