దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ (south african variant) వెలుగుచూసిన నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం(india covid new variant) అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పకడ్బందీగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. వారికి కొవిడ్ పరీక్షలు కచ్చితంగా చేయాలని(Center on covid new variant) సూచించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వచ్చే వారిపట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కేంద్ర రాజేశ్ భూషణ్ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.
"విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించాలి. కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టిసారించాలి. వీసా పరిమితులు తగ్గించడం, అంతర్జాతీయ ప్రయాణంపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఈ వేరియంట్ వ్యాప్తికి అవకాశం ఉంటుంది. అందువల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది."