తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆన్​లైన్​ గేమ్స్​లో అసలు పేర్లు వాడకూడదు- కేంద్రం ఆదేశాలు

ఆన్​లైన్​ గేమ్స్​, వాటిలో చేసే కొనుగోళ్లు పిల్లలు, తల్లిదండ్రులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కేంద్రం అప్రమత్తమైంది. ఆన్‌లైన్‌ గేముల్లో కొనుగోళ్లు చేపట్టేందుకు తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేసింది.

Safe Online Gaming
ఆన్​లైన్​ గేమ్స్​లో అసలు పేర్లు వాడకూడదు- కేంద్రం ఆదేశాలు

By

Published : Dec 11, 2021, 12:24 PM IST

కొన్నిరకాల ఆన్‌లైన్‌ ఆటలు, వాటిలో చేసే కొనుగోళ్లు పిల్లలు, తల్లిదండ్రులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆన్‌లైన్‌ గేముల్లో కొనుగోళ్లు చేపట్టేందుకు తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేసింది. సబ్‌స్క్రిప్షన్ల కోసం ఆయా యాప్‌లలో క్రెడిట్‌/డెబిట్‌ కార్డులను రిజిస్టర్‌ చేసుకోవడాన్ని నిషేధించింది.

ఆన్‌లైన్‌ గేమ్‌లకు సంబంధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కేంద్ర విద్యాశాఖ తాజాగా ఈ మేరకు సూచనలు జారీ చేసింది. విరామం లేకుండా ఎక్కువసేపు ఈ ఆటలు ఆడటం వల్ల ప్రధానంగా పాఠశాల విద్యార్థులు 'గేమింగ్‌ రుగ్మత' బారిన పడుతున్నారని అందులో పేర్కొంది. అలాంటివారిలో మానసిక, శారీరక ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలిపింది. కొన్ని గేమింగ్‌ కంపెనీలు చిన్నారుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నాయని.. ఆటల్లో తదుపరి లెవల్స్‌ని కొనుగోలు చేసేలా, ఇన్‌-యాప్‌ కొనుగోళ్లు చేపట్టేలా వారిని బలవంతం చేస్తున్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో 'పిల్లల సురక్షిత ఆన్‌లైన్‌ గేమింగ్‌' కోసం ఏం చేయాలో, ఏం చేయకూడదో స్పష్టంగా తెలియజేసింది.

ఏం చేయాలంటే..

  • ధ్రువీకృతంకాని వెబ్‌సైట్‌ల నుంచి సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్‌ చేయకుండా పిల్లల్లో అవగాహన కల్పించాలి.
  • వెబ్‌సైట్‌లలో వచ్చే లింక్‌లు, చిత్రాలు, పాప్‌అప్‌లపై క్లిక్‌ చేస్తే ఎదురయ్యే అనర్థాలను వారికి వివరించాలి.
  • గోప్యతను కాపాడుకునేందుకు ఆటల్లో 'స్క్రీన్‌ నేమ్‌ (అవతార్‌)'ను మాత్రమే ఉపయోగించేలా ప్రోత్సహించాలి.
  • ఓటీపీ ఆధారిత చెల్లింపుల ద్వారానే కొనుగోళ్లు చేయాలి.
  • లావాదేవీలకు గరిష్ఠ పరిమితి విధించాలి.
  • ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతున్నప్పుడు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే.. వెంటనే స్క్రీన్‌షాట్‌ తీసుకోవాలి. ఆటను ఆపేసి, సైబర్‌ క్రైం అధికారులకు ఫిర్యాదు చేయాలి.
  • చిన్నారులు ఉపయోగించే కంటెంట్‌ను పర్యవేక్షించేందుకు వీలుగా ఇళ్లలో ఇంటర్నెట్‌ గేట్‌వేను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

ఏం చేయకూడదంటే..

  • తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇన్‌-గేమ్‌ కొనుగోళ్లు చేపట్టకూడదు.
  • సబ్‌స్క్రిప్షన్ల కోసం యాప్‌లలో క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల రిజిస్ట్రేషన్‌ చేయకూడదు.
  • ఆన్‌లైన్‌ గేమింగ్‌ కోసం ఉపయోగించే ల్యాప్‌టాప్‌లు, మొబైళ్ల నుంచి పిల్లలు నేరుగా కొనుగోళ్లు చేపట్టకుండా నిరోధించాలి.
  • అంతర్జాలంలో గేమ్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు, గేమింగ్‌ ప్రొఫైళ్లను తయారు చేసుకునేటప్పుడు అసలు పేర్లు, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదు.

ఇదీ చూడండి:-పిల్లల కోసం డి-అడిక్షన్‌ సెంటర్లు.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details