ఇంటింటికీ వెళ్లి కరోనా టీకా వేయడం సాధ్యం కాదని, దీనివల్ల మొత్తం టీకా ప్రక్రియే ఆలస్యమవుతుందని సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకుగల కారణాలనూ వివరించింది. నిపుణుల సలహా మేరకే కొవిడ్ వ్యాక్సిన్ విధానాన్ని రూపొందించామని పేర్కొంటూ 218 పేజీల ప్రమాణ పత్రాన్నిఆదివారం రాత్రి సమర్పించింది కేంద్రం. ఇందులో ఈ విషయాలను ప్రస్తావించింది.
ఇంటింటికీ టీకా ఎందుకు కుదరదంటే..
- వ్యాక్సిన్ అందించిన తర్వాత ప్రతి ఒక్కరినీ 30 నిమిషాలపాటు పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి ఇంటి వద్దా అంత సేపు ఉండడడం సాధ్యం కాదు.
- టీకా తీసుకున్నవారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వారికి చికిత్స అందించడానికి అవసరమైన సౌకర్యాలు టీకా సెంటర్లో అందుబాటులో ఉంటాయి. అదే ఇంటి వద్ద అయితే కష్టం.
- ప్రతిసారీ బాక్సులను తెరిచి, మూయడం వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చి టీకా సామర్థ్యం తగ్గుతుంది.
- ఒక వయల్ (సీసా) తెరిస్తే దాన్ని నాలుగు గంటల్లోపు లబ్దిదారులకు అందించాల్సి ఉంటుంది. లేదంటే వృథా అవుతుంది. ఇంటింటికి వెళ్లి వేయడం వల్ల టీకాలు వృథా అవుతాయి.
- టీకా కోసం రిజిష్టర్ చేసుకున్న లబ్ధిదారులతోపాటు, చుట్టుపక్కల వారూ వస్తారు. దానివల్ల సిబ్బందిపై అనవసర ఒత్తిడి పెరుగుతుంది.
- ప్రతి ఇంటికీ వెళ్లడం వల్ల సిబ్బందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది.
- కొవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకొనేటప్పుడు వారి పిన్‌కోడ్ ఆధారంగా సమీపంలోని సెంటర్‌ను ఎంచుకొనే వెసులుబాటు కల్పించాం.
కొవాగ్జిన్ నుంచి ఐసీఎంఆర్‌కు 5% రాయల్టీ