తెలంగాణ

telangana

ETV Bharat / bharat

45 ఏళ్లు పైబడిన వారికి టీకా- కేంద్రం కీలక సూచనలు - ఈవిన్‌ పోర్టల్

కరోనా వ్యాక్సిన్ల వృథాను ఒకశాతం లోపునకు పరిమితం చేయాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​ సమావేశమయ్యారు. టీకాలు ఎందుకు వృథా అవుతున్నాయో రాష్ట్రాలు సమీక్షించుకోవాలన్నారు. ఈ అంశంపై పలు సూచనలు చేశారు.

Centre holds review meet with states, UTs ahead of opening up COVID vaccination to people above 45
టీకా వృథా కట్టడికి..ఈ చర్యలు తీసుకోండి

By

Published : Mar 31, 2021, 7:31 PM IST

దేశంలో రెండు దశల్లో భాగంగా కరోనా టీకా కార్యక్రమం నడుస్తోంది. ఏప్రిల్​ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కూడా కేంద్రం టీకా డోసులను పంపిణీ చేయనుంది. ఈ క్రమంలో టీకా వృథాపై ప్రధానంగా దృష్టి సారించింది. ఆ వృథాను ఒకశాతం లోపునకు కట్టడి చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బుధవారం ఆరోగ్య శాఖ సూచించింది. అలాగే దేశవ్యాప్తంగా టీకాల కొరత లేదని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, అధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్ సమావేశమయ్యారు. టీకా కార్యక్రమం జరుగుతోన్న తీరును సమీక్షించడంతో పాటు పలు సూచనలు చేశారు.

  • కరోనా టీకా కవరేజ్‌ తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
  • టీకా వృథాను ఒకశాతం లోపునకు పరిమితం చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా టీకా వృథా సగటు 6 శాతంగా ఉంది. దీనిపై ఆ మధ్య ప్రధాని మోదీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ వృథాను తగ్గించేందుకు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలి.
  • టీకాల కాల పరిమితి ముగియకముందే.. సకాలంలో అందుబాటులో ఉన్న స్టాక్‌ను వినియోగించుకోవాలి.
  • టీకా వినియోగానికి సంబంధించి కొవిన్‌, ఈవిన్‌ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.
  • మరోవైపు, ఇప్పటివరకు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 6.30 కోట్ల పైచిలుకు మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details