తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో కొవాగ్జిన్​ ఉత్పత్తికి కేంద్రం అనుమతి - మహారాష్ట్ర కరోనా వార్తలు

కరోనాపై పోరులో భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకా ఉత్పత్తికి ముంబయికి చెందిన హాఫ్కిన్ ఇనిస్టిట్యూట్​కి అనుమతినిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనితో మహారాష్ట్రలో టీకా వేగవంతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేంద్రం నిర్ణయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Haffkine Institute
హాఫ్కిన్ ఇనిస్టిట్యూట్

By

Published : Apr 16, 2021, 5:32 AM IST

దేశీయంగా రూపొందించిన కరోనా టీకా కొవాగ్జిన్​ను ముంబయిలోని హాఫ్కిన్ ఇనిస్టిట్యూట్​లో ఉత్పత్తి చేసేందుకు కేంద్రం అనుమతించింది. దీంతో మహారాష్ట్రలో ఈ టీకా ఉత్పత్తి ప్రారంభం కానుంది.

ముంబయిలోని హాఫ్కిన్ ఇనిస్టిట్యూట్
హాఫ్కిన్ ఇనిస్టిట్యూట్ లోగో

రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో టీకా ఉత్పత్తికి అనుమతించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గతంలో కేంద్రాన్ని అభ్యర్థించారు. తాజాగా అనుమతుల జారీతో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఇది భారత్ బయోటెక్-హైదరాబాద్‌ ప్లాంట్​లో ఉత్పత్తి అవుతోంది.

ఇదీ చదవండి:కరోనా పంజా- మహారాష్ట్రలో 61,695మందికి పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details