కరోనా నియంత్రణకు ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఔషధ సరఫరా విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏయే రాష్ట్రాలకు ఎంత మోతాదు సరఫరా చేయాలో వివరిస్తూ.. సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్రాలవారి జాబితానూ పంపింది కేంద్రం.
రెమ్‌డెసివిర్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం - రాష్ట్రాలకు రెమ్‌డెసివిర్ సరఫరా
12:12 May 08
రెమ్‌డెసివిర్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం
రెమ్‌డెసివిర్ ఔషధ సంస్థలతో చర్చించాకే తన నిర్ణయాన్ని కేంద్రం వెలువరించింది. ఈ నెల 16 వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా సరఫరా అయ్యే డోసుల వివరాలు..
- జైడస్ క్యాడిలా - 9,82,100
- హెటిరో - 17,17,050
- మైలాన్ - 7,28,000
- సిప్లా - 7,32,300 డోసులు
- షిన్జిన్/సన్ - 3,73,000
- జుబిలియంట్ - 4,45,700
- డాక్టర్ రెడ్డీస్ - 3,21,850
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 17కోట్ల 49లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించింది. అందులో మొత్తం 16.65 కోట్ల మోతాదును వినియోగంలోకి రాగా.. మిగిలినదంతా వ్యర్థమైంది. వీటిలో.. ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇంకా 84 లక్షలకుపైగా డోసులు ఇవ్వాల్సి ఉంది.
ఇదీ చదవండి:'భారత్-ఈయూ చర్చలతో వాణిజ్యం బలోపేతం'