తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీకి 10 బృందాలు - దిల్లీ ప్రైవేటు ఆసుపత్రుల సందర్శనకు 10 బృందాలు

దిల్లీలో కరోనా రోగులకు ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స అందిస్తున్న విధానాన్ని పరిశీలించేందుకు 10 బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ మల్టీ- డిసిప్లీనరీ బృందాలు.. ఆసుపత్రులను సందర్శించి రెండురోజుల్లో నివేదికను సమర్పించనున్నాయి.

Centre forms 10 teams for inspecting private hospitals treating COVID-19 patients in Delhi
దిల్లీ ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీకి 10 బృందాలు

By

Published : Nov 17, 2020, 5:46 AM IST

దిల్లీలో కరోనా రోగులకు ప్రైవేటు ఆసుపత్రులు.. చికిత్స అందిస్తున్న తీరును పరిశీలించేందుకు 10 బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం. దిల్లీ ప్రభుత్వం, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా ఆసుపత్రులు చర్యలు చేపడుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని ఈ మల్టీ-డిసిప్లీనరీ బృందాలు తనిఖీలు చేస్తాయి.

కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం.. ఈ మల్టీ-డిసిప్లీనరీ బృందాలు ప్రైవేటు ఆసుపత్రులను తక్షణమే సందర్శిస్తాయి. రెండు రోజుల్లో రిపోర్టును కేంద్రానికి అందిస్తాయి.

దిల్లీలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలోనే డిసిప్లీనరీ బృందాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. మరో బృందాన్ని అదనంగా ఏర్పాటు చేసి రిజర్వులో పెట్టారు.

ఈ బృందాలు మొత్తం 114 ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించి కరోనా రోగుల చికిత్సపై రిపోర్టును అందించనున్నాయి. కరోనా డాష్​బోర్డుల్లో ఐసీయూ బెడ్ల అందుబాటుకు సంబంధించిన వివరాలను వెల్లడించడం, కొవిడ్​-19 డిశ్ఛార్జ్​ విధానాలను పాటించడం, ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల నిర్వహణ తదితర ప్రభుత్వ మార్గదర్శకాల అమలును ఈ బృందాలు పరిశీలించనున్నాయి.

ఇదీ చూడండి:-దిల్లీలో ఒక్క రోజే 1400 చలాన్లు జారీ

ABOUT THE AUTHOR

...view details