యూరియాయేతర ఎరువుల ధరలను పెంచొద్దని కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీల్నిఆదేశించింది. డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకే వంటి ఎరువుల బస్తాలపై గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్పీ)ని పెంచొద్దని, పాత ధరలకే విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశంలో డీఏపీ వంటి ఎరువుల ధరలను తయారీ సంస్థలు ఈనెల ఒకటి నుంచి పెంచాయి. ఈ అంశంపై ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించిన కేంద్రం తాజా ఆదేశాలు వెలువరించింది. పాత ధరలకే విక్రయించేందుకు ఎరువుల కంపెనీలు అంగీకరించాయని సమావేశం తర్వాత కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్ మాండవ్య తెలిపారు.