తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంగా నదిలో.. కరోనా ఆనవాళ్లపై అధ్యయనం - గంగా నదిలో.. కరోనా ఆనవాళ్లపై అధ్యయనం

గంగానదిలో మృతదేహాల కలకలం నేపథ్యంలో.. యూపీ, బిహార్‌లోని నది ప్రవాహం నుంచి నమూనాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఈ నీటిలో కరోనా వైరస్‌ ఆనవాళ్లు ఏమేరకు ఉన్నాయో దశల వారీగా అధ్యయనం చేపట్టనుంది.

Ganga water
గంగా నది

By

Published : Jun 8, 2021, 6:27 AM IST

గంగా నదిలో ఇటీవల మృతదేహాల ప్రవాహాలు వెలుగుచూడటం, అవన్నీ కరోనా బాధితులవేనన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌లోని పలు జిల్లాల్లో నది నుంచి నీటి నమూనాలు సేకరించింది. ఈ నీటిలో కరోనా వైరస్‌ ఆనవాళ్లు ఏమేరకు ఉన్నాయో దశల వారీగా అధ్యయనం చేపట్టనుంది. ఇప్పటికే మొదటి దశలో యూపీలోని కన్నౌజ్‌, బిహార్‌లోని పట్నా జిల్లాల్లో 13 ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించినట్టు లఖ్‌నవూలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టాక్సికాలజీ రీసెర్చ్‌ డైరెక్టర్‌ సరోజ్‌ బాతిక్‌ తెలిపారు.

నీటిలో కరోనా వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ ఉంటే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల ద్వారా తెలుస్తుందన్నారు. గంగా నది జీవవ్యవస్థ లక్షణాల పరిశీలన కూడా ఈ అధ్యయనంలో భాగమని ఆయన చెప్పారు. కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖలోని నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా (ఎన్‌ఎంసీజీ) ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరుగుతోంది.

ఇదీ చదవండి :'రెమ్​డెసివిర్​ను ఆస్పత్రులే ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details