కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) (Cbi Chief), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Ed Chief) డైరెక్టర్ల పదవీ కాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం ప్రకారం రెండేళ్ల పదవీకాలంతో కొనసాగుతున్న సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.
సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం ఇక ఐదేళ్లు- కేంద్రం ఆర్డినెన్స్ - cbi chief
కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ(Cbi Chief), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Ed Chief) డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టానికి మార్పులు చేస్తూ.. ఆర్డినెస్స్ తీసుకొచ్చింది.
కేంద్రం ఆర్డినెన్స్
రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు లేకపోవడం కారణంగా ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది.
ఇదీ చూడండి:'చట్టం మానవీయంగా పని చేయాలి'