ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేంద్రపాలిత ప్రాంతాల్లో టెస్టులు పెంచండి' - Ajay Bhalla

దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా పరీక్షలను వేగవంతం చేయాలని, ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలని కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులకు కేంద్రం సూచనలు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వచ్చే మూడు వారాల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులను కేంద్ర వైద్య, ఆరోగ్య కార్యదర్శి రాజేశ్​ భూషణ్ ఆదేశించారు.

rajesh bhushan
రాజేష్ భూషణ్​
author img

By

Published : Apr 20, 2021, 6:59 PM IST

కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా పరీక్షలను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను కేంద్రం ఆదేశించింది. ఆసుపత్రుల్లో మరో మూడు వారాలకు సరిపడా మౌలిక వసతులు కల్పించేలా.. ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ సూచించారు. ఈ మేరకు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఉన్నతాధికారులతో కేంద్ర వైద్య, ఆరోగ్య కార్యదర్శి రాజేశ్​ భూషణ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్ష నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే సమావేశాలు నిషేధించాలని, గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలని, మార్కెట్ల సమయాలను కుదించాలని తెలిపారు.

కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఆర్​టీ-పీసీఆర్​ టెస్టులను పెంచాలని సూచించారు. దేశంలో పరిస్థితి తీవ్రరూపం దాల్చుతున్న క్రమంలో వచ్చే మూడు వారాల పాటు అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ తెలిపారు.

ఇదీ చదవండి :కరోనా దృష్ట్యా యూజీసీ నెట్ పరీక్ష వాయిదా

ABOUT THE AUTHOR

author-img

...view details