ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్‌లో అగ్ని ప్రమాదాలు జరగకుండా రాష్ట్రాలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. కొవిడ్ ఆస్పత్రుల్లో వరుస ప్రమాదాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈ మేరకు లేఖ రాశారు.
" దేశం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలి. అగ్నిమాపక చర్యలపై సమీక్షించుకోవాలి."
--కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా