తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అవసరాల మేరకే ఆక్సిజన్​ వినియోగం' - జంబో కంటెనర్​ల ఏర్పాటు

ప్రాణవాయువును అవసరాల మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలని కేంద్రం సూచించింది. పెరుగుతున్న కొవిడ్​ కేసులను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్​ వినియోగంపై తగు జాగ్రత్తలు పాటించాలని కోరింది.

mha, corona
'అవసరాల మేరకే ఆక్సిజన్​ వినియోగం'

By

Published : Apr 30, 2021, 9:31 PM IST

Updated : Apr 30, 2021, 10:39 PM IST

ఆక్సిజన్​ కొరతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ప్రాణవాయువును అవసరాల మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించింది. కరోనా వైరస్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని మెడికల్​ ఆక్సిజన్‌ వినియోగంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

దేశంలో తగినంత ఆక్సిజన్​ నిల్వ ఉన్నందున లభ్యత గురించి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు హోంశాఖ అదనపు కార్యదర్శి పియూష్​​ గోయల్ ఆయా ప్రభుత్వాధికారులతో సమీక్ష నిర్వహించారు.

జంబో కంటైనర్ల ఏర్పాటు...

పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్​తో కూడిన పడకల సంఖ్యను పెంచే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకుగాను ప్రాణావాయువు ఉత్పత్తి చేసే పరిశ్రమలకు దగ్గరగా ఉన్న ఆసుపత్రుల్లో జంబో కంటైనర్​లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ఇప్పటికే ఉక్కు కర్మాగారాలు ద్రవ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాయని తెలిపింది. దీంతో ప్రజావసరాలకు సరిపడినంత ఆక్సిజన్​ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి గోయల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఇవీ చూడండి:

'ఆక్సిజన్​ కోసం ఆపరేషన్​ సముద్ర సేతు-2'

కరోనాపై భయాలొద్దు.. ఇవి తెలుసుకోండి

Last Updated : Apr 30, 2021, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details