ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరగడాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. పాజిటివిటీ రేటును సమీక్షించాలని.. నిర్ధరణ పరీక్షలను పెంచాలని చురకలు సూచించింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి, జమ్ముకశ్మీర్ అదనపు ఆరోగ్య ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా లేఖలు రాశారు. గతవారం కొత్త కేసులు భారీగా పెరిగిన విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించింది కేంద్రం. నెల రోజులుగా పాజిటివిటీ రేటు కూడా పెరిగినట్లు ఈ సందర్భంగా గుర్తుచేసింది. పండగల సమయంలో కఠినంగా నిబంధనలను అమలు చేయాలని సూచించింది.
కేంద్రం లేఖలోని ప్రధాన అంశాలు..
- హిమాచల్ ప్రదేశ్‌లో గత వారం రోజుల్లో కొత్త కేసులు దాదాపు 22 శాతం పెరిగాయి.
- జమ్ముకశ్మీర్లో వారానికొకసారి కొత్త కేసుల్లో సుమారు 61 శాతం పెరుగుదల కనిపించింది. పాజిటివిటీ రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. రెండు వారాల్లో కొత్త కేసులు 67 శాతం పెరిగాయి.
- ఆంధ్రప్రదేశ్లో గత నాలుగు వారాల్లో కొత్త కేసుల సంఖ్య రెట్టింపు అయింది. అయితే పాజిటివిటీ రేటు 2.5 శాతం కంటే తక్కువగా నమోదైంది. అత్యధిక కేసులు వెలుగుచూసిన తూర్పుగోదావరిని ఆందోళనకరమైన జిల్లాగా గుర్తించింది కేంద్రం.
కఠిన ఆంక్షలు తప్పనిసరి..