తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుదుచ్చేరి అసెంబ్లీకి ముగ్గురు నామినేట్​

పుదుచ్చేరి శాసనసభకు భాజాపాకు చెందిన ముగ్గురిని కేంద్ర హోం శాఖ నియమించింది. వెంకటేశన్‌ కే, వీపీ రామలింగం, ఆర్‌బీ అశోక్‌బాబులను ఎమ్మెల్యేలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

The Union Home Ministry
కేంద్ర హోం శాఖ

By

Published : May 10, 2021, 11:03 PM IST

పుదుచ్చేరి శాసనసభకు ముగ్గురు ఎమ్మెల్యేలను కేంద్ర హోం శాఖ నామినేట్​ చేసింది. కేంద్ర పాలిత ప్రాంతం చట్టం, 1963 కింద ముగ్గురు ఎమ్మెల్యేలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ముగ్గురు వీరే..

  • వెంకటేశన్‌ కే -- మాజీ డీఎంకే ఎమ్మెల్యే
  • వీపీ రామలింగం-- మాజీ పుదుచ్చేరి స్పీకర్ వీపీ శివకొలుందు సోదరుడు
  • ఆర్‌బీ అశోక్‌బాబు -- న్యాయవాది

పుదుచ్చేరిలో మొత్తం 33 స్థానాలు ఉండగా.. శాసనసభ ఎన్నికలు 30 స్థానాలకు జరిగాయి. ఎన్​డీఏ 16 సీట్లు సాధించి విజయకేతనం ఎగురవేసింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఆల్​ ఇండియా నేషనల్​ రీజినల్​ కాంగ్రెస్​ పార్టీ(ఏఐఎన్​ఆర్​సీ) అధినేత ఎన్​ రంగస్వామి ఇటీవల ప్రమాణస్వీకారం చేశారు.

ఇదీ చదవండి :ఇన్​స్టాంట్ డ్రింక్​ బాటిళ్లలో 2.5 కిలోల బంగారం

ABOUT THE AUTHOR

...view details