తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్భిణీలు, వికలాంగులకు వర్క్​ ఫ్రమ్ హోమ్: కేంద్రం

దేశంలో కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో గర్భిణీలు, వికలాంగులు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.

WFH
ఉద్యోగులు, వర్క్ ఫ్రమ్ హోమ్

By

Published : May 7, 2021, 11:55 AM IST

కరోనా తీవ్రత నేపధ్యంలో ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న గర్భిణులు, వికలాంగ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ- డీఓపీటీ.

కంటైన్‌మెంట్ జోన్‌లో నివసించే ఉద్యోగులు, అధికారులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని డీఓపీటీ తెలిపింది. కార్యాలయానికి విధులకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగులు కొవిడ్ నియమాలను తప్పక పాటించాలని ఆదేశించింది. మే 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొంది.

ఇదీ చదవండి:'24 గంటలు కాలేదు.. అప్పుడే రాష్ట్రపతి పాలనా?

ABOUT THE AUTHOR

...view details