సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా మొదట శ్రమ్ శక్తి భవన్, ట్రాన్స్పోర్ట్ భవన్లను కూల్చనున్నారు. వీటి స్థానంలో ఎంపీ కార్యాలయాలు నిర్మించనున్నారు. నూతన పార్లమెంటు నిర్మాణాన్ని డిజైన్ చేసిన హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సంస్థకు చెందిన ఓ అధికారి ఈ వివారాలు వెల్లడించారు. శ్రమ్ శక్తి భవన్, ట్రాన్స్పోర్ట్ భవన్లు ప్రస్తుతం రఫీ మార్గ్, సన్సద్ మార్గ్‌లలో ఉన్నాయి.
కొత్తగా నిర్మించపోయే పార్లమెంటు భవన నిర్మాణానికి ఈనెల 10న శంకుస్థాపన చేశారు ప్రధని నరేంద్ర మోదీ. ఆధునిక హంగులతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవనాన్ని 888 మంది లోక్‌సభ ఎంపీలు, 384మంది రాజ్యసభ సభ్యులకు సరిపోయేలా విశాలంగా నిర్మించనున్నారు. జాతీయ చిహ్నాన్ని భవనంపై కిరీటంలా ఏర్పాటు చేయనున్నారు.
టన్నెల్లు
ఎంపీ కార్యాలాయాలను నూతన పార్లమెంటు భవనానికి అనుసంధానిస్తూ టన్నెల్లు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు హెచ్సీపీ అధికారి తెలిపారు. కొత్త భవనంలో ఆరు కమిటీ గదులు ఉండనున్నాయి.