తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెంట్రల్​ విస్టాలోనే 2022 రిపబ్లిక్ డే​ పరేడ్​! - రాజ్​పథ్​

సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​లో(Central Vista project) భాగంగా నిర్మిస్తున్న సరికొత్త 'రాజ్​పథ్​'​లోనే వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్​(Republic Day parade) జరుగుతుందని తెలిపారు అధికారులు. నవంబర్​ నాటికి పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Central Vista project
సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​

By

Published : Jul 16, 2021, 10:51 PM IST

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో(Central Vista project) భాగంగా రాజ్​పథ్​(Rajpath) పునర్నిర్మాణ పనులు ఈ ఏడాది నవంబర్​ నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్(Republic Day parade)​ సరికొత్త రాజ్​పథ్​​లోనే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​లో భాగంగా చేపడుతోన్న నిర్మాణ పనులపై శుక్రవారం.. సమీక్షించారు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ పూరీ. దేశ ప్రజలు గర్వించదగిన నిర్మాణాలను పొందుతారని తెలిపారు.

" సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​లో జరుగుతోన్న నిర్మాణ పనులను గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సెక్రటరీ, అధికారులు, సీపీడబ్ల్యూడీ, కాంట్రాక్టర్​, ఆర్కిటెక్ట్​ బిమాల్​ పటేల్​తో కలిసి సమీక్షించాం. నిర్మాణాల పురోగతి సంతృప్తికరంగా, సమయానుగుణంగా సాగుతోంది. పౌరులు గర్వించదగిన భవనాలను పొందుతారు."

- హర్దీప్​ సింగ్​ పూరీ, కేంద్ర మంత్రి

రాజ్​పథ్​​ పునర్నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా.. పెద్ద ఎత్తున రాతి పనులు, అండర్​పాస్​ నిర్మాణాలు, భూగర్భ సౌకర్యాలు, ఉద్యానవనాలు, పార్కింగ్​కు కావాల్సిన స్థలం పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. కృత్రిమ సరస్సులపై 12 వంతెనల నిర్మాణం చేపడుతున్నామని, దీని ద్వారా రాజ్​పథ్​ను సందర్శించే వారికి గొప్ప అనుభూతి లభిస్తుందన్నారు. కొత్తగా అభివృద్ధి చేసిన రాజ్​పథ్​​లోనే రిపబ్లిక్​ డే పరేడ్​ జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్​ విస్టా ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా రాజ్​పథ్​ పునర్నిర్మాణ​ పనులు చేపడుతోంది ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సంస్థ షాపుర్​జీ పల్లోంజి అండ్​ కంపెనీ. సెంట్రల్​ విస్టాలో కొత్త త్రిభుజాకార పార్లమెంట్​ భవనం, ఉమ్మడి కేంద్ర సచివాలయం, మూడు కిలోమీటర్ల మేర పునరుద్ధరించిన రాజ్​పత్​(రాష్ట్రపతి భవన్​ నుంచి ఇండియా గేట్​ వరకు), కొత్త ప్రధాని నివాసం, పీఎంఓ భవనం, కొత్త ఉపరాష్ట్రపతి ఎన్​క్లేవ్​లు ఉన్నాయి.

ఇదీ చూడండి:'రాజ్​పథ్​' పునర్నిర్మాణ పనులకు భూమిపూజ

ABOUT THE AUTHOR

...view details