వచ్చే ఏడాది డిసెంబరులోగా ప్రధానమంత్రికి నూతన నివాసం అందుబాటులోకి రానుంది. ప్రతిష్ఠాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా దాన్ని నిర్మించనున్నారు. అందుకు పర్యావరణ పరంగా అవసరమైన అనుమతులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రధాని నివాసంతో పాటు ప్రధానమంత్రి భద్రతా విభాగంలోని ప్రత్యేక భద్రతా బృందం(ఎస్పీజీ) ప్రధాన కార్యాలయం, అధికారుల కోసం మరో భవనం నిర్మాణాన్ని కూడా 2022 డిసెంబరులోగా పూర్తి చేయాలని తాజాగా గడువు విధించారు.
2022 డిసెంబర్లోగా ప్రధానికి నూతన నివాసం - 2022 డిసెంబరులోగా ప్రధాని భవనం పూర్తి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నిర్మాణంగా చేపట్టిన ప్రధానమంత్రి నివాస భవనం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ నిర్మాణ పనుల్ని కేంద్రం 'అత్యవసర సేవ'గా గుర్తించింది.
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్, ప్రధాని నివాస భవనం
మరోవైపు.. ఉపరాష్ట్రపతి నివాస నిర్మాణ పనులు వచ్చే ఏడాది మే లోగా పూర్తి అవుతాయని అంచనా. లాక్డౌన్ సమయంలోనూ పనులు నిలిచిపోకుండా ఉండేందుకుగానూ.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును 'అత్యవసర సేవ'గా కేంద్రం గుర్తించడం గమనార్హం.
ఇదీ చదవండి:నాయకులకు నిబంధనలన్నీ నీటి మీద రాతలే!