Central Vista Project Work: సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు తలపెట్టిన సుందరీకరణ పనులు ఇప్పటివరకూ 60 శాతం మాత్రమే పూర్తయినట్లు కేంద్రం తెలిపింది. ఈ పనులను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. వచ్చే ఏడాది జరిగే గణతంత్ర వేడుకలు సెంట్రల్ విస్టా మార్గంలోనే జరపాలని నిర్ణయించింది. అయితే గడువు సమీపిస్తున్నా.. పనులు పూర్తి కాకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఏడాది అక్టోబరు వరకు గడువు నిర్దేశించిన నూతన పార్లమెంటు భవనం పనులు ఇప్పటివరకు 35శాతం మాత్రమే పూర్తయినట్లు కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అడిగిన ప్రశ్నకు గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌషల్ కిషోర్ ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఈ పనుల కోసం ఈ ఏడాది రూ.1,289 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.