యాస్ తుపాను(Yaas cyclone) నష్టాన్ని సమీక్షించేందుకు కేంద్ర మంత్రుల బృందం బంగాల్, ఒడిశాలో నేడు పర్యటించనుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వారు పర్యటించనున్నారు. రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో మంత్రులు సమావేశం కానున్నారు.
పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి.. ఏడుగురు మంత్రుల బృందం బంగాల్‌కు చేరుకుంది.