తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెంట్రల్​ విస్టాలో ఒక్క చెట్టూ కొట్టరు - కొత్త పార్లమెంట్​ భవనంలో చెట్ల నరికివేతపై కేంద్రం వ్యాఖ్య

సెంట్రల్​ విస్టా నిర్మాణ పనుల్లో భాగంగా ఒక్క చెట్టును కూడా నరికివేసే అవకాశాలు లేవని అధికార వర్గాలు తెలిపాయి. పనులకు అడ్డంకిగా ఉన్న భారీ వృక్షాలను సైతం ఇతర ప్రాంతాలకు సురక్షితంగా తరలించి మళ్లీ నాటనున్నామని వెల్లడించారు.

central vista project
సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు

By

Published : Jun 7, 2021, 6:32 AM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్​ విస్టా నిర్మాణ పనుల్లో భాగంగా ఒక్క చెట్టును కూడా నరికివేసే అవకాశాలు లేవు. పనులకు అడ్డంకిగా ఉన్న భారీ వృక్షాలను సైతం ఇతర ప్రాంతాలకు సురక్షితంగా తరలించి మళ్లీ నాటనున్నారు. మరికొన్నింటిని అక్కడే వేరేచోటుకి తరలిస్తారు.

ఇక్కడ నుంచి 3,230 చెట్లను బదర్​పుర్​లోని ఎన్​టీపీసీ ఎకోపార్కుకు తరలించి అక్కడ నాటుతారు. మరో 1,753 వృక్షాలను సెంట్రల్​ విస్టా ప్రాంతంలోనే వేరువేరు చోట్ల నాటుతారు. అవి కాకుండా కొత్తగా 2,000 మొక్కలు పెడతారు. దాంతో గతంతో పోల్చితే ఈ ప్రాంతంలో అదనంగా 563 చెట్లు ఉన్నట్లు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details