జిల్లా అధ్యక్షులతో అమిత్ షా భేటీ..
తమిళనాడు పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో అమిత్ షా భేటీ అయ్యారు. చెన్నైలో పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
20:53 November 21
జిల్లా అధ్యక్షులతో అమిత్ షా భేటీ..
తమిళనాడు పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలతో అమిత్ షా భేటీ అయ్యారు. చెన్నైలో పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
18:21 November 21
మోదీ నాయకత్వంలో..
కరోనాపై పోరులో తమిళనాడు ముందుందని అమిత్ షా ప్రశంసించారు. పళనిస్వామి-పన్నీర్‌సెల్వం నేతృత్వంలో వైరస్ నియంత్రణ సమర్థంగా సాగుతోందన్నారు. దేశమంతా ప్రధాని మోదీ నాయకత్వంలో వైరస్‌పై పోరాడుతోందని పేర్కొన్నారు.
18:15 November 21
జయలలిత హయాంలో అభివృద్ధి..
ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రాల మధ్య పోటీతత్వం పెరిగిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. సుపరిపాలనలో తమిళనాడు మొదటిస్థానాన్ని సాధించడం సంతోషకరమని అన్నారు.
18:06 November 21
భాజపాతో కలిసి పోటీకి..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తాయని సీఎం పళనిస్వామి ప్రకటించారు. భాజపా-అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
భాజపాతో తమ పొత్తు కొనసాగుతుందని తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు. చెన్నై లీలా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా సమక్షంలో ప్రకటించారు.
17:31 November 21
అభివృద్ధి పనులను ప్రారంభించిన షా..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్రహోమంత్రి అమిత్‌షా రెండు రోజుల పాటు చెన్నైలో పర్యటిస్తున్నారు. లీలా ప్యాలెస్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన అమిత్ షా.. చెన్నై మెట్రో రెండో దశ పనులకు దృశ్యమాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. తిరువళ్లూరు జిల్లాలో 380 కోట్ల రూపాయలతో నిర్మించిన రిజర్వాయర్‌ను ప్రారంభించారు.
చెన్నై శనివారం మధ్యాహ్నం చేరుకున్న అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి కారులో బయలుదేరిన హోం మంత్రి కారు దిగి నడుచుకుంటూ వెళ్లి కార్యకర్తలకు అభివాదం చేశారు.
గోబ్యాక్ అంటూ..
ఈ క్రమంలో గోబ్యాక్ అమిత్ షా అంటూ ఓ వ్యక్తి ఫ్లకార్డు విసిరాడు. ఫ్లకార్డు అమిత్‌షాకు 50 మీటర్ల దూరంలో పడగా భాజపా కార్యకర్తలకు అతనికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యకర్తలు అతనిని కొట్టడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
రజనీకాంత్‌తో భేటీ!
పర్యటనలో భాగంగా రూ.67 వేల కోట్లతో నిర్మించనున్న పలు ప్రాజెక్టులకు అమిత్‌షా శంకుస్థాపన చేస్తారు. చెన్నై పర్యటనలో అమిత్‌షా ప్రముఖ సినీనటుడు రజనీకాంత్., కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
17:19 November 21
తేర్వాయికండిగై రిజర్వాయర్‌ను ప్రజలకు అంకితం చేసిన అమిత్ షా
చెన్నైలో ఏర్పాటు చేసి కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తేర్వాయికండిగైలో రూ.380 కోట్ల వ్యయంతో నిర్మించిన రిజర్వాయర్‌ను ప్రజలకు అంకితం చేశారు.
దృశ్యమాధ్యమం ద్వారా చెన్నై మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అమిత్ షా.
17:04 November 21
ఎంజీఆర్, జయలలితకు అమిత్ షా నివాళి..
చెన్నైలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితకు నివాళులు అర్పించారు.
15:56 November 21
14:39 November 21
చెన్నై చేరుకున్న అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెన్నై చేరుకున్నారు. తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం.. ఆయనకు ఘన స్వాగతం పలికారు. భాజపా కార్యకర్తలు కూడా చెన్నై విమానాశ్రయానికి తరలివచ్చారు.
అమిత్ షా వెళ్లే దారి పొడవున భాజపా, అన్నాడీఎంకే కార్యకర్తలు.. ఆయనకు స్వాగతం పలికారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల పొత్తులు, సీట్ల కేటాయింపుపై సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వంతో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ప్రముఖ సినీనటుడు రజనీకాంత్, కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరితో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పలు అభివృద్ధి పనుల ప్రారంభం..
తిరువళ్లూర్ జిల్లా తేరువాయి కండ్రిగలో రూ.380 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్‌ను ప్రజలకు అంకితం చేయనున్నారు. రూ.61,843 కోట్లతో చేపట్టే చెన్నై మెట్రోరైలు రెండో దశ పనులకు అమిత్‌షా చేతులమీదుగా శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కూడా పాల్గొననున్నారు.
ఇదీ చూడండి:తమిళనాడుకు అమిత్ షా.. రజనీకాంత్‌తో భేటీ!