ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ పెట్రోల్, డీజిల్‌పై పన్ను వసూళ్లు 300శాతానికి పైగా పెరిగాయని లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు.
2014-15లో పెట్రోల్‌పై రూ.29,279 కోట్లు, డీజిల్‌పై రూ.42,881 కోట్లు ఎక్సైజ్ సుంకం వసూలు చేసింది కేంద్రం. సహజ వాయువుపై విధించిన ఎక్సైజ్ సుంకంతో కలిపి 2014-15లో రూ.74,158 కోట్లు వసూలు చేయగా.. ఇది 2020 ఏప్రిల్-2021 జనవరి నాటికి రూ.2.95 లక్షల కోట్లకు పెరిగింది.
''అంతర్జాతీయ చమురు ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగానే ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దేశంలో మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులను కొనసాగించేందుకు ఎక్సైజ్ సుంకం తోడ్పడుతోంది. ఇది ముందే నిర్దేశించినది. ప్రస్తుత ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని ఇది తప్పదు.''
-అనురాగ్ ఠాకూర్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి.