పూర్తి టీకా(2 డోసులు) పొందినవారు మరోసారి వ్యాక్సిన్ తీసుకునేందుకు అనుమతి లేదని కేరళ హైకోర్టుకు స్పష్టంచేసింది కేంద్ర ప్రభుత్వం. కన్నూర్‌కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు తెలిపింది.
'టీకా రెండు డోసులే... మళ్లీమళ్లీ కుదరదు' - కరోనా
పూర్తి వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు మరోసారి టీకా పొందేందుకు అనుమతి లేదని కేంద్రం తెలిపింది. కేరళ హైకోర్టులో ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ మేరకు స్పష్టంచేసింది.
!['టీకా రెండు డోసులే... మళ్లీమళ్లీ కుదరదు' re-vaccination](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12800296-thumbnail-3x2-yv.jpg)
కరోనా టీకా
అప్పటికే కొవాగ్జిన్ రెండు డోసులు పొందిన పిటిషనర్.. కొవిషీల్డ్ తీసుకోవడానికి అనుమతి కోరారు. తాను పనిచేసే సౌదీ అరేబియాలో కొవాగ్జిన్‌ను గుర్తించలేదని, ఫలితంగా ఆ దేశానికి వెళ్లేందుకు తనకు అనుమతి లభించడం లేదని ఆయన వివరించారు. అయితే... అందుకు అవకాశం లేదని హైకోర్టుకు స్పష్టంచేసింది కేంద్రం.
ఇదీ చూడండి:ఒకే ఒక్క కేసు వచ్చిందని దేశమంతా లాక్డౌన్