Ap high court: హైకోర్టును అమరావతి నుంచి తరలించే ప్రతిపాదన తమ వద్ద పెండింగ్‌లో లేదని కేంద్రం మరోసారి తేల్చిచెప్పింది. తరలించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఉమ్మడి నిర్ణయానికి రావాలని చెప్పింది. ఇద్దరు కలిసి పూర్తిస్థాయి ప్రతిపాదన పంపిస్తేనే పరిశీలిస్తామని తెలిపింది. వైసీపీ ఎంపీ రంగయ్య అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ విధంగా లిఖితపూర్వ సమాధానం ఇచ్చింది.
Ap high court: ఏపీ హైకోర్టు తరలింపు ప్రతిపాదన ఏమీలేదని తేల్చిన కేంద్రం - తాజా వార్త
ఏపీ హైకోర్టు
13:23 July 21
రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఉమ్మడి నిర్ణయంతో ప్రతిపాదన పంపితేనే కేంద్రం పరిశీలిస్తుందన్న న్యాయశాఖ
Last Updated : Jul 21, 2023, 2:38 PM IST