తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాహన ఫిట్​నెస్​ టెస్ట్​కు కేంద్రం కొత్త రూల్స్.. ఇకపై అలా కుదరదు!

New Vehicle Fitness Policy: వాహనం ఏదైనా సరే.. రోడ్డు ఎక్కాలంటే ఫిట్​నెస్​ సర్టిఫికెట్ తప్పనిసరి. ఇప్పటివరకు ఉన్న వాహన ఫిట్​నెస్ టెస్ట్​​ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. అవేంటి? వాహన రీరిజిస్ట్రేషన్ సమయంలో యజమానులు ఏం చేయాలి? వంటి ప్రశ్నలకు జవాబులు మీకోసం.

By

Published : Apr 7, 2022, 6:10 PM IST

Vehicle Fitness test new rules: వాహనాల ఫిట్​నెస్​ టెస్ట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా మాత్రమే ఈ పరీక్ష చేసేలా కొత్త విధానం రూపొందించింది. వచ్చే ఏడాది ఏప్రిల్​ నుంచి దశల వారీగా కొత్త విధానం అమలుకు సిద్ధమైంది. మనుషుల ప్రమేయం లేకుండా పూర్తిగా యంత్రాల ద్వారా ఈ పరీక్ష చేయిస్తే.. పొరపాట్లు జరగకుండా ఉంటాయని, పూర్తి సామర్థ్యం ఉన్న వాహనాలు మాత్రమే రోడ్లపైకి వస్తాయని కేంద్రం భావిస్తోంది.

వాహన ఫిట్​నెస్​ టెస్ట్ ఎందుకు? తప్పనిసరిగా చేసుకోవాలా?

ప్రతి వాహనం ప్రయాణానికి అనువుగా ఉందా? వాహన సామర్థ్యం ఎలా ఉంది? వంటి విషయాలను తనిఖీ చేస్తుంది రవాణా శాఖ. దీని ద్వారా వాహన శక్తి సామర్థ్యాలు, వాహనం ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అనే విషయాలు తెలుస్తాయి. వీటిని బేరీజు వేసిన రవాణా శాఖ సర్టిఫికెట్​ను జారీ చేస్తుంది. బండి రోడ్డు ఎక్కాలంటే ఈ సర్టిఫికెట్​ తప్పనిసరి.

పాత, కొత్త విధానాలకు తేడా ఏంటి?

ప్రస్తుతం రవాణా శాఖ అధికారులే వాహనాల ఫిట్​నెస్​ టెస్ట్ చేస్తున్నారు. దీని వల్ల కొన్ని పొరపాట్లు జరిగి, సామర్థ్యం లేని వాహనాలు రోడ్లపైకి వచ్చే ప్రమాదముంది. అందుకే ఆటోమేటెడ్​ టెస్టింగ్ విధానాన్ని తెస్తోంది కేంద్రం. అంటే.. మనుషుల ప్రమేయం లేకుండా పూర్తిగా యంత్రాలను ఉపయోగించి వాహన సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

కొత్త విధానం ఎప్పటి నుంచి?

కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. 2023 ఏప్రిల్​ 1 నుంచి భారీ సరకు రవాణా వాహనాలు, బస్సులు వంటి భారీ ప్రయాణ వాహనాలకు ఆటోమేటెడ్ ఫిట్​నెస్​ టెస్ట్​ను తప్పనిసరి చేసింది.

మిగిలిన వాహనాలకు ఎప్పుడు?

మధ్యతరహా, చిన్న రవాణా వాహనాలకు కొంత వెసులుబాటును కల్పించింది కేంద్రం. ఈ వాహనాలకు 2024 జూన్ 1 నుంచి ఏటీఎస్​తో ఫిట్​నెస్ పరీక్ష చేయించాల్సి ఉంటుంది.

ఫిట్​నెస్​ టెస్ట్ ఎప్పుడు చేయించాలి?

వ్యక్తిగత వాహనాలు కొని 15 సంవత్సరాలు గడిచాక రిజిస్ట్రేషన్​ను పునరుద్ధరించకోవాలి. రిజిస్ట్రేషన్​ పునరుద్ధరణ(రెన్యూవల్​) సమయంలోనే ఫిట్​నెస్ టెస్ట్​ చేయించుకోవాలని రవాణా శాఖ తెలిపింది. కేంద్రం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఎనిమిది ఏళ్లలోపు కమర్షియల్ వాహనాలకు రెండు సంవత్సరాల పరిమితితో రీరిజిస్ట్రేషన్ చేస్తారు. ఎనిమిది సంవత్సరాలు దాటిన కమర్షియల్​ వాహనాలకు ఒక సంవత్సరం కాలపరిమితి.

ఇదీ చదవండి:'ఎలక్ట్రిక్ వాహనాలపై తిరగండి'.. పెట్రోల్​ ధరలపై ప్రశ్నిస్తే మంత్రి సలహా

ABOUT THE AUTHOR

...view details