Central Focus On Chandrababu And Lokesh Security: టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ భద్రతపై దృష్టి కేంద్రం సారించింది. చంద్రబాబు, లోకేశ్‌కు కల్పిస్తున్న భద్రతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది. జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌పై ఇటీవల దాడులు జరగడంతో.. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. భద్రత కల్పనలో జగన్ ప్రభుత్వం విఫలమైందని కనకమేడల ఫిర్యాదు చేశారు.దీంతో చంద్రబాబు కాన్వాయ్‌పై దాడులపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గత సంవత్సరం నవంబర్ 4వ తేదీన చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడిపై కేంద్రం నివేదిక కోరింది. అదే విధంగా లోకేశ్ పాదయాత్ర భద్రత వివరాలను కోరింది. చంద్రబాబు, లోకేశ్‌కు భద్రత కల్పించాలని డీజీపీ, సీఎస్‌కు ఆదేశించింది. ఈ మేరకు జులై 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కేంద్ర హోంశాఖ రాసినట్టు సమాచారం. ప్రతిపక్ష నేతలపై దాడులపైనా కేంద్రం హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Central Focus On Chandrababu And Lokesh Security: చంద్రబాబు, లోకేశ్ భద్రతపై దృష్టి సారించిన కేంద్రం - central fires on chandrababu security
central_focus_on_Chandrababu_and_lokesh_security
17:37 August 04
చంద్రబాబు, లోకేశ్ భద్రతపై నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ
Last Updated : Aug 4, 2023, 6:11 PM IST