Central Election Commission Letter to KCR : భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CM KCR).. కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బాధ్యతాయుతమైన పదవితో పాటు పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని.. వాటిని తీవ్రంగా పరిగణిస్తా అంటూ సీఈసీ సలహా (అడ్వయిజరీ) హెచ్చరించింది. ఈ లేఖను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపించి.. సీఎం కేసీఆర్‌కు అందజేయాలని సూచించింది.
ఆంధ్రోళ్ల బూట్లు మోసిన వ్యక్తి ఇవాళ నన్ను తిడుతున్నాడు : సీఎం కేసీఆర్
CEC Warns CM KCR :ప్రజలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలను.. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) చాలా తీవ్రంగా పరిగణిస్తుందని సీఈసీ అడ్వయిజరీ స్పష్టం చేసింది. అలా మాట్లాడిన వ్యక్తుల పార్టీల అనుమతులు.. రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని పేర్కొంది. ప్రస్తుతానికి సీరియస్‌గా తీసుకోవడం లేదని, ఆ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని తెలిపింది. రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ పరిమితులు ఉన్నాయని సీఈసీ వెల్లడించింది.
10 ఏళ్ల బీఆర్ఎస్, 50 ఏళ్ల కాంగ్రెస్ - ఎవరి పాలన బాగుందో చూసి ఓటేయండి : సీఎం కేసీఆర్