తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఎస్​ఈ క్లాస్​-12 ఫలితాలు విడుదల​.. బాలికలే టాప్ - సీబీఎస్ఈ బోర్డు

Central Board of Secondary Education
మధ్యాహ్నం 2 గంటలకు సీబీఎస్​ఈ క్లాస్​-12 రిజల్ట్స్​

By

Published : Jul 30, 2021, 10:28 AM IST

Updated : Jul 30, 2021, 5:27 PM IST

17:17 July 30

99.37 శాతం ఉత్తీర్ణత..

12వ తరగతి ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​(సీబీఎస్​ఈ). 99.37 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని పేర్కొంది. బాలురపై బాలికలే పైచేయి సాధించారని, 0.54 శాతం మేర బాలికలు అధికంగా ఉత్తీర్ణులైనట్లు వెల్లడించింది.  

గత ఏడాది (88.78 శాతం)తో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 10 శాతం మేర పెరిగిందని పేర్కొంది సీబీఎస్​ఈ. ఈ ఏడాది 70 వేల మందికిపైగా విద్యార్థులు 95శాతంకన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులైనట్లు వెల్లడించింది. మరో లక్షన్నర మందికిపైగా 90శాతం మార్కులు సాధించినట్లు తెలిపింది. మరో 65 వేల మంది విద్యార్థుల గ్రేడ్లు ఇంకా నిర్ణయించాల్సి ఉందని, వాటిని ఆగస్టు 5న ప్రకటిస్తామని తెలిపింది సీబీఎస్​ఈ

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలను cbse.nic.in, cbseresults.nic.in వెబ్​సైట్లలో చెక్​ చేసుకోవచ్చు.

టాలెంట్​ పవర్​ హౌస్​లు

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలైన క్రమంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొవిడ్​ మహమ్మారి కారణంగా ఈ ఏడాది బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎన్నడూ చూడని పరిస్థితులను ఎదుర్కొన్నారని చెప్పారు. గత ఏడాది నుంచి విద్యా ప్రపంచంలో చాలా మార్పుల వచ్చాయని, వాటిని అందిపుచ్చుకొని గొప్ప ప్రదర్శన చేశారని కొనియాడారు. వారికోసం గొప్ప భవిష్యత్తు ఎదురుచూస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఒక టాలెంట్​కు పవర్​హౌస్​​లుగా అభివర్ణించారు.  

వచ్చే వారంలో 10వ తరగతి ఫలితాలు!

12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన క్రమంలో.. 10వ తరగతి ఫలితాలపై కసరత్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు సీబీఎస్​ఈ పరీక్షల అధికారి సన్యామ్​ భరద్వాజ్. వచ్చే వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.  

14:09 July 30

బాలికలదే హవా

సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు వెలువడ్డాయి. cbse.nic.in, cbseresults.nic.in వెబ్​సైట్లలో రిజల్ట్ చెక్​ చేసుకోవచ్చు. 

ఈ ఏడాది 70 వేల మందికిపైగా విద్యార్థులు 95శాతంకన్నా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులైనట్లు సీబీఎస్​ఈ వెల్లడించింది. మరో లక్షన్నర మందికిపైగా 90శాతం మార్కులు సాధించినట్లు తెలిపింది. మొత్తం బాలురుకన్నా బాలికలే అధిక ప్రతిభ కనబరిచారని చెప్పింది.

మరో 65 వేల మంది విద్యార్థుల గ్రేడ్లు ఇంకా నిర్ణయించాల్సి ఉందని, వాటిని ఆగస్టు 5న ప్రకటిస్తామని తెలిపింది సీబీఎస్​ఈ.

ఈ ఏడాది కరోనా కారణంగా సీబీఎస్​ఈ పరీక్షలు రద్దు చేసింది. ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా, ప్రత్యామ్నాయ విధానంలో విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించింది.

10:25 July 30

సీబీఎస్​ఈ క్లాస్​-12 ఫలితాలు విడుదల​

ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు సీబీఎస్​ఈ 12వ తరగతి ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది సీబీఎస్​ఈ. 

ఈ ఏడాది కరోనా కారణంగా సీబీఎస్​ఈ పరీక్షలు రద్దు చేసింది. ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా, ప్రత్యామ్నాయ విధానంలో విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించింది. ఆ వివరాలను ఈ మధ్యాహ్నం విడుదల చేయనుంది. 

ఈ నెలాఖరులోగా పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని సీబీఎస్​ఈ, ఇతర రాష్ట్ర బోర్డులను సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. 

Last Updated : Jul 30, 2021, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details